Russia cancer vaccine: త్వరలోనే క్యాన్సర్‌కు టీకాను అభివృద్ధి చేయబోతున్న రష్యా..! 13 d ago

featured-image

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను తమ దేశంలోని పలు పరిశోధన సంస్థలు కలిసి అభివృద్ధి చేసినట్టు రష్యా ప్రకటించింది. 2025 నుంచి క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ ను రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అందించనుంది.


ఈ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది.. 


క్యాన్సర్ కణాలను గుర్తించి, అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుంది. క్యాన్సర్ కణతుల అభివృద్ధిని, రోగ సంబంధ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ వెల్లడించింది. వ్యాక్సిన్ పేరు ఏంటనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. రష్యాలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్నేండ్లుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. 2022లో రష్యాలో 6,35,000 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగానే ఈ టీకాను అభివృద్ధి చేసింది. 


క్యాన్సర్ ను ఎదుర్కొనడంలో వ్యాక్సిన్ల పాత్ర.. 


థెరఫ్యూటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలపై ఉండే నిర్దిష్ట ప్రొటీన్లు, యాంటిజెన్లను లక్ష్యంగా చేసుకొని, అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తాయి. ఇందుకోసం కొన్ని వ్యాక్సిన్లలో నిర్వీర్యం చేసిన వైరస్‌ల‌ను ఉపయోగిస్తారు.హెచ్ఐవీ వ్యాక్సిన్ వంటి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటి ముప్పును తగ్గిస్తాయి. శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణతులు వేగంగా ఎదగకుండా, తిరగబడకుండా అడ్డుకోవడంలో, ప్రారంభ దశలో క్యాన్సర్‌ను తొలగించడంలో వ్యాక్సిన్లు కీలకంగా పని చేస్తాయి.


అనేక దేశాల ప్రయత్నాలు.. 

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సొంతంగా క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమా అనే ఒక రకమైన బ్రెయిన్ క్యాన్సర్ కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. యూకేలో సైతం మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌కు ఒక వ్యాక్సిన్‌ను తయారుచేసి పరీక్షించగా వ్యాధి బాధితులు కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD